Andhra King Thaluka: ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్

గత కొన్ని సినిమాలుగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni)కి సక్సెస్ అనేదే దక్కలేదు. అందం, టాలెంట్ ఎన్ని ఉన్నా రామ్ కు సక్సెస్ మాత్రం కరువైపోతుంది. దీనికంతటికీ కారణం అతని స్టోరీ సెలక్షన్. ఈ విషయాన్ని అతని ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు. కేవలం సరైన కథలు ఎంపిక చేసుకోలేకపోవడం వల్లే రామ్ ఇప్పటికీ సక్సెస్ కోసం పాకులాడాల్సి వస్తుంది.
ఇస్మార్ట్ శంకర్(ismart shankar) తర్వాత రామ్ ఖాతాలో మరో సక్సెస్ లేదు. ఆ సినిమా తర్వాత చేసిన రెడ్(red), ది వారియర్(the warrior), స్కంద(skandha), డబుల్ ఇస్మార్ట్(double ismart) అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపులుగా నిలిచినవే. దీంతో నెక్ట్స్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందేనని కసిపై ఉన్న రామ్, ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty) డైరెక్టర్ పి. మహేష్ బాబు(p. mahesh babu) దర్శకత్వంలో ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king thaluka) సినిమా చేస్తున్నాడు.
భాగ్య శ్రీ బోర్సే(bhagya sri borse) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర(upendra) కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం హీరో రామ్ పై శేఖర్ మాస్టర్(Sekhar Master) కొరియోగ్రఫీలో ఇంట్రడక్షన్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా అయినా రామ్ కు సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి.