Trailer Talk: ఆంధ్రా కింగ్ తాలూకా.. రామ్ ఈసారి గట్టిగా కొట్టేట్టున్నాడు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా(andhra king Thaluka). ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నరు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr.Polishetty) ఫేమ్ పి. మహేష్ బాబు(P. Mahesh Babu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya sri borse) హీరోయిన్ గా నటించగా, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra) కీలక పాత్రలో కనిపించనున్నారు.
నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేయగా, 2.39 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంది. ఓ హీరోకు వీరాభిమానిగా రామ్ చాలా అద్భుతమైన యాక్టింగ్ ను కనబరిచాడు.
తన లైఫ్ లో ఎదురయ్యే ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్ లాంటి సీన్ లో కూడా రామ్ టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. భాగ్యశ్రీ కూడా చాలా నేచురల్ గా కనిపిస్తుంది. ట్రైలర్ లోని కొన్ని డైలాగ్స్ ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అభిమాని కోసం హీరో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడనే నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ట్రైలర్ చూస్తుంటే రామ్ ఈ మూవీతో సాలిడ్ హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.






