Ramayana: రామాయణలో భాగం కానున్న అమితాబ్

బాలీవుడ్ లో వస్తున్న రామాయణ(Ramayana) సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుందో తెలిసిందే. నితేష్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గా ఇంట్రో గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా గ్లింప్స్ తర్వాత రామాయణపై ఉన్న హైప్ ఇంకా పెరగడంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంలో మునిగిపోయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. రామాయణలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్(amithab Bachan) కూడా భాగం కానున్నారంటున్నారు. మొన్నామధ్య కల్కి 2898ఏడీ(Kalki 2898AD)లో అశ్వత్థామ క్యారెక్టర్ చేసి తన యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన అమితాబ్, ఇప్పుడు రామాయణ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో కూడా భాగమవడం విశేషం.
అయితే రామాయణ సినిమాలో అమితాబ్ ప్రత్యేకంగా ఎలాంటి పాత్రనూ పోషిచండం లేదట. కేవలం జటాయువు(Jatayuvu) అనే పాత్రకు అమితాబ్ వాయిస్ ఓవర్‌ను మాత్రమే ఇవ్వనున్నారట. కానీ ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. కాగా ఈ మూవీలో రాముడిగా రణ్‌బీర్(Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి(sai pallavi), రావణుడిగా యష్(Yash) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా రానుండగా అందులో మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి.