డైరెక్టర్ ఛేంజ్ పై వీరమల్లు నిర్మాత ఏమన్నారంటే
పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. రీసెంట్ గానే ఈ సినిమా డైరెక్టర్ గా క్రిష్ తప్పుకుని ఆ ప్లేస్ లోకి జ్యోతికృష్ణ వచ్చాడు. ఎలక్షన్స్ హడావిడిలో ఈ విషయం పెద్దగా హైలైట్ కాలేదు కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం ఈ విషయం తీవ్ర చర్ఛకు దారి తీసింది. సినిమా ఇప్పటికే బాగా లేటవడంతో ఫ్యాన్స్ ఆ సినిమా మీద హోప్స్ తగ్గించుకుని తమ ఫోకస్ ను ఓజీకి మార్చేశారు.
అయితే ఈ సినిమాకు డైరెక్టర్ మారడం పై నిర్మాత ఏఎం రత్నం స్పందించాడు. అందరికీ కుదరాలనే ఉద్దేశంతో క్రిష్ ప్లేస్ లోకి తన కొడుకు జ్యోతికృష్ణ వచ్చాడని, ముందు నుంచి స్క్రిప్ట్ గురించి పూర్తిగా తెలియడంతో పాటూ డైరెక్షన్ లో జ్యోతికృష్ణకు ఎక్స్పీరియన్స్ ఉండటం వల్లే వీరమల్లును పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు.
పైగా తాను, పవన్ ఇద్దరూ డైరెక్టర్లే కాబట్టి అవసరమైతే సలహాలిస్తామని అన్నాడు. అయితే డైరెక్టర్లుగా పవన్, ఏఎం రత్నం ఇద్దరికీ చెప్పుకోదగ్గ సక్సెస్లు లేవు. అలాంటప్పుడు వారిద్దరి సలహాలు ఏ మేరకు పనిచేస్తాయో ఆలోచించాలి. ఇవన్నీ పక్కనపెడితే వీరమల్లు ఫస్ట్ పార్ట్ ఈ ఇయరే రిలీజ్ అవుతుందని స్వయంగా నిర్మాతే మరోసారి చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు కానీ అదెంత వరకు కుదురుతుందో చూడాలి.













