Allu Aravind: శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital) లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ (Sreetej) ను సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ గత రెండు వారాలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని కిమ్స్ వైద్యులు చేతన్, విష్ణు తేజ్‌లు మంగళవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగా అందటం లేదని, బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామన్నారు.













