బన్నీ బ్రాండ్ వాల్యూ అలాంటిది మరి!
అల్లు అర్జున్ కెరీర్ పుష్ప సినిమాకు ముందు ఒకలా, తర్వాత ఒకలా అన్నది తెలిసిందే. అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీని పుష్ఫ మూవీ ఐకాన్ స్టార్ ను చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేసింది, టాలీవుడ్‌కు జాతీయ అవార్డు కూడా తీసుకురాగలిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే పుష్ప తర్వాత బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది.
ముఖ్యంగా మార్కెట్ యాంగిల్ లో బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడానికి బన్నీకి చాలా పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నట్లు టాక్. ఒక్క రోజుకు గాను బన్నీ అక్షరాలా రూ.6 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. కొన్నేళ్ల క్రితం వరకు రూ.60 లక్షలు తీసుకున్న బన్నీ, నేషనల్ అవార్డ్ వచ్చాక రెమ్యూనరేషన్ ను పెంచాడని ముంబై మీడియా టాక్.
ఇలాంటివి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయరు కానీ బన్నీ రేంజ్ ప్రకారం చూసుకున్నా, సన్నిహితులు చెప్తున్న మాట ప్రకారం చూసుకున్నా ఈ వార్తలు నిజమేననిపిస్తుంది. ఏదైనా బ్రాండ్ యాజమాన్యం బన్నీని వాడుకోవాలంటే అంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. సింగిల్ కాల్షీట్ లో బన్నీ తో ఫోటోషూట్, యాడ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మళ్లీ ఏదైనా డేట్స్ కావాలంటే ఛార్జెస్ అప్లై. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తర్వాత బన్నీకి ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం కూడా న్యాయమేనని సదరు కంపెనీలు భావిస్తున్నాయట. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు సరిదిద్దుకోవాలన్న సామెతను బన్నీ బాగానే ఫాలో అవుతున్నాడు. కాగా, ప్రస్తుతం బన్నీ పుష్ప2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.













