AA22: అట్లీ ప్రాజెక్టుపై బన్నీ అప్డేట్
పుష్ప2(Pushpa2) తో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాతి సినిమాను అట్లీ(Atlee) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మొన్న బ(Bunny)న్నీ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఆల్రెడీ మంచి బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాపై అల్లు అర్జున్ రీసెంట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
అట్లీ తన వద్దకు వచ్చి మూవీ గురించి ఓ ఐడియా చెప్పగానే వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్టు బన్నీ తెలిపాడు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని బన్నీ చెప్పాడు. ఈ మూవీలోని వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని, దాని కోసమే #AA22 టీమ్ వర్క్ చేస్తున్నట్టు బన్నీ వెల్లడించాడు.
బన్నీ మాటల్ని బట్టి అల్లు అర్జున్- అట్లీ సినిమా ఎక్కువ భాగం విజులవల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఈ ప్రాజెక్టును ఉద్దేశించి డైరెక్టర్ అట్లీ కూడా ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అనే విషయాన్ని రివీల్ చేశాడు. కాబట్టి ఈ ప్రాజెక్టులో అట్లీ కూడా అన్ని విధాలా మరింత కేర్ తీసుకునే ఛాన్సుంది.






