Allu Arjun: బన్నీ- త్రివిక్రమ్ మూవీ అప్డేట్
పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో బన్నీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్ తన సత్తా చాటాడు. పుష్ప2(Pushpa2) సినిమా రూ.1800 కోట్లు వసూలు చేసి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో అల్లు అర్జున్(Allu Arjun) తర్వాతి సినిమా ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి పెరిగిపోయింది.
పుష్ప2 రిలీజ్ కు ముందు బన్నీ పుష్ప3(Pushpa3) చేస్తాడన్నారు కానీ అది ఇప్పట్లో కుదరదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో బన్నీ(Bunny) తర్వాత చేయబోయే డైరెక్టర్ల లిస్టులో త్రివిక్రమ్, అట్లీ పేర్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్(Trivikram) తో బన్నీ సినిమా ఉంటుందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ మధ్యలో అట్లీ(Atlee) లైన్ లోకి రావడంతో అల్లు అర్జున్ తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ మారింది.
బన్నీ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్ తోనే చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఇటీవలే త్రివిక్రమ్, అల్లు అర్జున్ ను కలిసి సినిమాకు సంబంధించిన ఫుల్ నెరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నాడట.













