TGFA: సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న అల్లు అర్జున్

గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోస్తావంలో … ఒక్క హగ్‌తో మొత్తం కవర్ అయిపోయింది
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ వివాహిత చనిపోగా.. ఆమె కుమారుడు చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి సంథ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ను అరెస్ట్ చేశారు. బెయిల్ రాకుంటే బన్నీ ఖచ్చితంగా జైలుకు వెళ్లేవాడే. బెయిల్‌పై విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ మొత్తం క్యూకట్టడం, ప్రభుత్వంపై బన్నీ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ వివాహిత చనిపోగా.. ఆమె కుమారుడు చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. ఈ దుర్ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి సంథ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. బెయిల్ రాకుంటే బన్నీ ఖచ్చితంగా జైలుకు వెళ్లేవాడే. బెయిల్‌పై విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ మొత్తం క్యూకట్టడం, ప్రభుత్వంపై బన్నీ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్ధర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో పుష్ప 2 సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్‌ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేశారు. ఈ ప్రకటన ద్వారా తనకు అల్లు అర్జున్‌పై ద్వేషం కానీ, వ్యతిరేకత గానీ లేదని రేవంత్ రెడ్డి సంకేతాలిచ్చారు. ఇదే పుష్ప 2 సినిమాకు గాను శ్రేయా ఘోషల్‌కు ఉత్తమ నేపథ్య గాయనీ పురస్కారం ప్రకటించారు. ఈలోగా అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం రానే వచ్చింది. టాలీవుడ్ మొత్తం ఈ వేడుకకు కదిలిరాగా.. ఆ కాసేపటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి ముందుగా అప్పటికే బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు మాట్లాడుకుంటూ ఉండగా సీఎం రాకతో వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు. బాలకృష్ణకు, బన్నీకి రేవంత్ హగ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో సినీ జనాలు షాక్ అయ్యారు. రేవంత్- బన్నీల అలింగనం ఈ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత వచ్చిన గ్యాప్ ఈ ఒక్క హగ్‌తో కవర్ అయిపోయింది.
రేవంత్ రెడ్డి అన్నగారికి థ్యాంక్స్ అనంతరం వేదిక మీద అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడి పురస్కారం అందజేశారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమాకు వచ్చిన తొలి అవార్డ్ ఇదేనని, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డ్ వేడుకను ఇలాగే కొనసాగించాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. తన పురస్కారాన్ని అభిమానులకు అంకితమిస్తున్నట్లు చెప్పిన బన్నీ.. సీఎం రేవంత్ రెడ్డి అన్నగారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నిర్మాత దిల్‌రాజుకి థ్యాంక్స్ చెప్పారు. పుష్పను హిందీలో విడుదల చేయాలని రాజమౌళీ సూచించకపోయుంటే ఇంతటి ఆదరణ దక్కేది కాదని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అల్లు అర్జున్. అనంతరం రేవంత్ రెడ్డి అనుమతితో పుష్ప 2 సినిమాలోని నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా రప్పా రప్పా అనే డైలాగ్ చెప్పి అలరించారు బన్నీ. చివరిలో జై తెలంగాణ, జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. మొత్తానికి అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డిల కలయిక ఈ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది.