Allu Arjun: బన్నీ నెక్ట్స్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్
పుష్ప2(Pushpa2) తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి మూవీని త్రివిక్రమ్(Trivikram) తో చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. మైథలాజికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ ఈ మూవీ కోసం నటీనటులు, టెక్నికల్ టీమ్ ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.
హారికా హాసినీ క్రియేషన్స్(Harika Haasine Creations), గీతా ఆర్ట్స్(Geetha Arts) సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థలు కొన్ని బేరాలడుతున్నట్టు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ కంటే ముందుగా బన్నీ(Bunny) మరో సినిమాను చేయాలని చూస్తున్నాడట. అందులో భాగంగానే అట్లీ(Atlee) లైన్ లోకి వచ్చాడు. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ- అట్లీ సినిమా ఫైనాన్షియల్ విషయాల వల్లే ఆలస్యమవుతుందని తెలుస్తోంది. పుష్ప2కు రూ.250 కోట్లు తీసుకున్న బన్నీ ఈ మూవీకి కూడా అంతే తీసుకుంటాడని, పాన్ ఇండియా డైరెక్టర్ కావడంతో ఎంతలేదన్నా అట్లీ రూ.100 కోట్లు తీసుకుంటాడని అంటే అట్లీ, బన్నీ రెమ్యూనరేషన్‌కే నిర్మాతలు రూ.350 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. ఇవి కాకుండా సినిమా నిర్మాణానికి బోలెడు ఖర్చవుతుంది. అందుకే సన్ పిక్చర్స్ బడ్జెట్ విషయంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే ఈ రెండు సినిమాలు ఆల్మోస్ట్ ఒకేసారి ఫైనల్ అయ్యేట్టున్నాయి.













