త్రివిక్రమ్ దర్శకత్వంలో త్రిష
త్రివిక్రమ్ సినిమాల్లో అతడు సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ సినిమా థియేటర్లలో కంటే బుల్లితెరపై ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. శాటిలైట్ హిస్టరీలో మోస్ట్ రిపీట్ వాల్యూ కలిగిన సినిమాగా టీవీ వర్గాలు అతడు గురించి స్పెషల్ గా చెప్తుంటాయి. ఈ సినిమా ద్వారా మహేష్ కు ఎంత పేరొచ్చిందో, హీరోయిన్ గా నటించిన త్రిషకు కూడా అంతే మంచి పేరొచ్చింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో త్రిష నటించింది ఆ ఒక్క సినిమాలోనే. వీరిద్దరి కాంబోలో ఆ తర్వాత మళ్లీ సినిమా వచ్చింది లేదు. తాజా సమాచారం ప్రకారం, త్రిష-త్రివిక్రమ్ త్వరలోనే మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గుంటూరు కారం చేస్తున్న త్రివిక్రమ్, ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే.
బన్నీతో త్రివిక్రమ్ చేసే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు సమానమైన మరో కీలక పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో త్రిషను తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నాడట. పొన్నియన్ సెల్వన్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన త్రిషకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడటంతో బన్నీ సినిమాలో ఈమె అయితే బాగుంటుందని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. సినిమా మొదలవడానికి చాలానే టైమ్ ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే త్రిషను ట్రై చేస్తున్నారంటే అమ్మడు క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.













