Allu Arjun Atlee: అల్లు అర్జున్- అట్లీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

పుష్ప2(Pushpa2) సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఎంతో మంచి క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. దీంతో పుష్ప2(Pushpa2) తర్వాత బన్నీ(Bunny) ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పుష్ప2 తర్వాత బన్నీ త్రివిక్రమ్(Trivikram) తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ బన్నీ తన నెక్ట్స్ మూవీని పాన్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో అనౌన్స్ చేశాడు.
అనౌన్స్‌మెంట్ తోనే భారీ అంచనాలను సెట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుకుంటుంది. అందులో భాగంగానే రీసెంట్ గా అల్లు అర్జున్ ను కలవడానికి అట్లీ హైదరాబాద్ కు వచ్చాడు. అట్లీ హైదరాబాద్ కు రావడం, వచ్చి బన్నీ కలిసిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవగా, ఈ సినిమా గురించి ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి.
అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమా గురించి ముందు అందరూ తమిళ సినిమా అనుకున్నారు కానీ ఈ సినిమా పూర్తిగా తెలుగు సినిమానే అని తెలుస్తోంది. అట్లీ, బన్నీతో ఓ భారీ పాన్ ఇండియన్ తెలుగు సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.