బన్నీ- శ్రీలీల అసలేం చేస్తున్నారు?
పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్, ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. పుష్ప2 పూర్తయ్యే వరకు బన్నీ కొత్త కమిట్మెంట్స్ ఏమీ ఇవ్వడం లేదు.
తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అని అందరికీ తెలిసినప్పటికీ, ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇదిలా ఉంటే బన్నీ, శ్రీలీల, త్రివిక్రమ్ కాంబోలో ప్రొడక్షన్ నెం.1 అంటూ నానా హంగామా చేస్తున్నారు ఆహా టీమ్ మెంబర్స్. అయితే వీరు ముగ్గురూ కలిసి పని చేస్తుంది సినిమాకా, యాడ్ క్యాంపైనా లేక ఏదైనా సాంగ్ కోసమా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
పరిస్థితుల్ని బట్టి చూస్తే ఇది సినిమా కోసమైతే కాదని కచ్ఛితంగా తెలుస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్ లో ఎంత తన తండ్రి సంస్థ అయినా సరే బన్నీ ఓటీటీ కోసం సినిమా చేయడు. అది కూడా త్రివిక్రమ్, శ్రీలీల ను తీసుకువచ్చి మరీ. ఇదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏదేమైనా సరే ఈ విషయమై ఆహా స్పష్టంగా క్లారిటీ ఇస్తే తప్ప తెలీదు.
ఈ ప్రాజెక్ట్ పై బన్నీ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో అందరి కన్నూ ఈ ప్రాజెక్ట్ పై ఉంది. పుష్ప సినిమా అయ్యాక బన్నీ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకుంటున్న టైమ్‌లో ఈ ప్రాజెక్ట్ ప్రచారంలోకి రావడంతో దీనిపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.













