Allu Aravind: ఆడవాళ్లను బొద్దింకలతో పోల్చడం వెనుక అసలు కారణం చెప్పిన అరవింద్
అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో శ్రీవిష్ణు(Sree Vishnu) హీరోగా తెరకెక్కిన సినిమా సింగిల్(Single). కార్తీక్ రాజు(karthik raju) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న రిలీజ్ కానుండగా ఈ సినిమాలో కేతిక శర్మ(kethika Sharma), ఇవానా(Ivaana) హీరోయిన్లుగా నటించారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ సింగిల్ ట్రైలర్(Single Trailer) ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ఆడవాళ్లు కాక్రోచ్ లాంటి వాళ్లనే డైలాగ్ ఉంది.
ఆ డైలాగ్ ఆడవాళ్లను కించపరిచేదిలా ఉందని మేకర్స్ మీడియా ప్రతినిధి అల్లు అరవింద్ ను అడగ్గా ఆయన దానికి క్లారిటీ ఇచ్చారు. ఈ డైలాగ్ ఉద్దేశం వేరే అని, సినిమా చూశాక తెలుస్తుందని, తమ సినిమాలో ఆడవాళ్లను ఏ విధంగానూ కించపరచలేదని, బొద్దింకలు ఎలాగైతే అణుబాంబాలు దాడిని సైతం తట్టుకుని బతుకుతాయో, ఆడాళ్లు కూడా అలానే స్ట్రాంగ్ గా ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకుంటారని చెప్పడమే తమ ఉద్దేశమన్నారు.
ఆడవాళ్లను తక్కువ చేయాలనే ఆలోచన తమకు ఏ మాత్రం లేదని, తమ సినిమాలోని డైలాగ్ ఉద్దేశం అందరికీ తప్పుగా అర్థమైందని, సింగిల్ మూవీ ఆడియన్స్ కు ఓ కొత్త అనుభూతినిస్తుందని, మూవీ చూసినంతసేపు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటూనే ఉంటారని, ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అసలు సినిమా రాలేదని అరవింద్ తెలిపారు.






