బాలీవుడ్‌కి వెళ్తున్న SKN
ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడితే ఎలాంటి వారైనా సక్సెస్ పొందొచ్చు. కానీ ఆ సక్సెస్ కోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అలా అని కష్టపడిన ప్రతి ఒక్కరినీ విజయం వరిస్తుందా అంటే అదీ లేదు. కష్టంతో పాటూ లక్ కూడా కలిసొస్తేనే అది సాధ్యమవుతుంది. అలా సక్సెస్ సాధించిన వారిలో టాలీవుడ్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ SKN కూడా ఒకడు.
మెగా అభిమానిగా ఉన్న SKN సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటాన్ని గమనించిన అల్లు శిరీష్, అతన్ని మెగా కాంపౌండ్‌కు దగ్గర చేశాడు. తర్వాత SKN టాలీవుడ్ లో పీఆర్వో గా పనిచేశాడు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇప్పుడు నిర్మాతగా మారి బేబీ అనే సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాడు.
SKN పనితనం తెలిసిన ఏ హీరో అయినా సరే అతనికి డేట్స్ ఇవ్వడానికి వెనుకాడరంటే అతిశయోక్తి లేదు. కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న SKN, తన తర్వాతి సినిమాల్లో ఒక సినిమాను కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు SKN తన సినిమాల ద్వారా తెలుగు హీరోయిన్లను పరిచయం చేస్తుంటాడు. ఇన్ని విధాల సక్సెస్ అయిన SKN, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, తన బేబీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కొటబొమ్మాళి పీఎస్ టీజర్ లాంచ్ లో అల్లు అరవింద్ వెల్లడించాడు. అంటే SKN త్వరలోనే బాలీవుడ్ లో కూడా సక్సెస్ కావడానికి రెడీగా ఉన్నాడన్నమాట.













