కల్కి డే1 అంచనాలు మామూలుగా లేవుగా!
మూవీ లవర్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కల్కి 2898ఏడి మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది సంక్రాంతి టైమ్ లో వచ్చిన సినిమాల హడావిడి తప్ప ఒక్క టిల్లు స్వ్కేర్ మాత్రమే అంచనాలను దాటి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయగలిగింది. మిగిలినవన్నీ బిజినెస్ కు సంబంధించి అన్ని వర్గాలను సంతృప్తి పరిచినవేమీ లేవు.
మూడు నెలల నుంచి ఖర్చులు గిట్టుబాటు కాని థియేటర్లు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో అన్ని సెంటర్లలో కల్కి షో లతో థియేటర్లు హౌస్ ఫుల్స్ తో కళకళలాడబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే డే 1 ఎంతొస్తుందనేది ఊహకు కూడా అందడం లేదు. ఎక్స్ట్రా షోలు ఎన్ని యాడ్ చేస్తున్నా టికెట్స్ క్షణాల్లో బుక్ అవుతుండటం చూసి బయ్యర్లు ఉక్కిరి బిక్కిరవుతున్నారు.
ముఖ్యంగా కల్కి కి నైజాం లో కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని అర్థమవుతుంది. ఏపీలో జీఓ రావడం లేటయినప్పటికీ అక్కడ కూడా టికెట్ బుకింగ్స్ హాట్ కేక్స్ లా జరుగుతున్నాయి. నార్త్ బెల్ట్ లో కూడా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ ని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలు నిజమైతే కల్కి డే 1 గ్రాస్ రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్యలో ఉంటుంది. ఓ వారం ముందు వరకు కల్కికి అసలు హైప్ లేదని ఫీలైన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ బుకింగ్స్ చూసి షాకవుతున్నారు. టాక్ బాగుంటే మరో రెండు వారాల పాటూ కల్కి కురిపించే కలెక్షన్ల వర్షాన్ని చూడొచ్చు.













