‘పెళ్ళాం చెపితే వినాలి!” లేదంటే ఈ తాట తీస్తారు : పూరి జగన్నాధ్ పోడ్ కాస్ట్ ఆడియో
లాక్డౌన్ సమయంలో పోడ్ కాస్ట్ ఆడియోలతో సంచలనం సృష్టిస్తున్న పూరి జగన్నాథ్.. తాజాగా ఆలుమగల బంధంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ రెండు వేర్వేరు జాతులని, రాత్రిపూట మాత్రమే కలిసుంటాయని చెబుతూ ఓపెన్ అయ్యారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుసపెట్టి పోడ్ కాస్ట్ ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు. సమాజంలోని ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ తనదైన స్టైల్లో వివరణ ఇస్తుండటంతో పూరి ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మోటివేషన్ టిప్స్ ఇస్తూనే జీవిత పాఠాలు, నగ్న సత్యాలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు పూరి. ఈ క్రమంలోనే తాజాగా ఆలుమగల బంధంపై ఆయన స్పందిస్తూ “ఆడాళ్లు, మగాళ్లు ఒక జాతి కాదనే సందేశమిచ్చారు.”ఒక బుక్ ఉంది. అందులో మగవారు అంగారక గ్రహానికి, స్త్రీలు శుక్ర గ్రహానికి చెందినవారు అని రాసి ఉంది. అదే నిజం.. ఆడాళ్లు, మగాళ్లు ఒక జాతి కాదు. రెండు వేర్వేరు గ్రహాలకు చెందినవారు. వాళ్లకి మనం, మనకి వాళ్లు ఏలియన్స్ (గ్రహాంతరవాసులం). మనం ఏలియన్స్తోనే లవ్‌లో పడ్డాం. వాటినే పెళ్లి చేసుకున్నాం. మగ ఏలియన్స్‌కి, ఆడ ఏలియన్స్‌కు భావాలు రాత్రిపూట ఏదో గంటసేపు కలుస్తాయే తప్ప, తెల్లవారితే పూర్తి విరుద్ధంగా మారుతాయి.
ఏదైనా సమస్య వచ్చిందంటే మగాడు సైలెంట్ అయిపోతాడు. ఇంట్లో ఎవ్వరికీ చెప్పడు. వాడిలో వాడే కుళ్లిపోతుంటాడు. కానీ ఆడాళ్లు అలా కాదు.. సమస్యను అందరితో పంచుకుంటారు. ఆడాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. వాళ్ల ప్రశ్నలన్నీ లాజికల్‌గా ఉంటాయి నాంపల్లి కోర్టులో లాగా. ఈ మగ వెధవలకి సమాధానాలు లేక, ఏం చెప్పాలో తెలియక ఆ టెన్షన్లో పెళ్ళాల మీద చేయిచేసుకుంటారు. దయచేసి అలా చేయొద్దు. మీ భార్యను గౌరవించండి.ఆర్గ్యుమెంట్ చేసే సమయాల్లో మగ ఏలియన్స్ చాలా ఎగ్రెసివ్‌గా ఉంటాయి. తప్పుడు భాషను వాడుతాయి. దయచేసి ఆ సమయంలో బూతులు మాట్లాడకండి. బంతి కోర్టులో ఉందని గుర్తు పెట్టుకోండి. ఇష్టం ఉన్నా, లేకపోయినా వాళ్లు చెప్పింది చచ్చినట్లు వినండి. మనం తాళి కట్టింది ఏలియన్‌కి. వాళ్ళ భాష వేరు.. మన భాష వేరు. యే..! రోజంతా అందరి దగ్గర అన్నీ భరించి వస్తావు. ఇక్కడ నీకెందుకు అంత పౌరుషం. భార్య చెప్పింది విను. కొన్ని సందర్భాల్లో ఏలియన్స్ దగ్గర మంచి ప్లన్స్ కూడా ఉండొచ్చు. వినను నేనంతే అంటే ఏలియన్స్ తాటతీస్తాయి. ఆడ, మగ మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి” అని అన్నారు పూరి జగన్నాథ్.













