కియారాకు మరో లక్కీ ఆఫర్
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జోరు మామూలుగా లేదు. తెలుగులో మొదటి సినిమా భరత్ అనే నేను తో సూపర్ హిట్ సాధించిన ఈ భామ బాలీవుడ్లో క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే కియారా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా కరణ్ జోహర్ చిత్రం కళంక్, అక్షయ్‌కుమార్ గుడ్‌న్యూస్ సినిమాలలో హీరోయిన్గా చేస్తోంది. తాజాగా ఈ భామకు మరో జాక్‌పాట్ ఆఫర్ తగిలిందట. తెలుగు, తమిళలో సూపర్ హిట్ అయిన హార్రర్ కామెడీ మూవీ కాంచన సినిమాను దర్శకుడు లారెన్స్ హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ హీరోగా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కియారాను సంప్రదించారట. ఈ లక్కీ ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పిందట ఈ బ్యూటీ. ఇక బాలీవుడ్లో విజయాల శాతం ఎక్కువగా ఉన్న హీరోలలో అక్షయ్‌కుమార్ ఒకరు. పైగా కాంచన గ్యారంటీగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న స్టోరీ. ఈ లెక్కన కియారా ఖాతాలో మరో హిట్ పడడం ఖాయమంటున్నారు.













