అక్షయ్ మరో రూ.2 కోట్లు సాయం
కరోనా నేపథ్యంలో బాలీవుడ్లో అత్యధికంగా సాయం ప్రకటించిన తొలి నటుడు అక్షయ్ కుమార్. ఏకంగా రూ. 25 కోట్లు పీఎం కేర్స్ కు విరాళంగా ఇచ్చారు. తాజాగా మరోసారి రూ.2 కోట్లు ముంబయి పోలీస్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ముంబయి పోలీస్ కమిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. పోలీస్ ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చినందుకు అక్షయ్ కుమార్‌కు ముంబయి పోలీసులు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. కమిట్మెంట్తో సిటీ ప్రజల జీవితాలకు భద్రతనిస్తున్న పోలీసులకు మీరందించిన తోడ్పాటు మరింత అండగా నిలుస్తుంది అని ట్వీట్ చేశారు.













