శ్రీవారి సేవలో నాగార్జున దంపతులు
ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, అమల దంపతులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, వైకుంఠ ద్వారా ప్రవేశం చేశారు. వారు వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా శ్రీవారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని, ప్రపంచం అంతా బాగుండాలని స్వామి వారిని కోరుకున్నట్లు నాగార్జున తెలిపారు. రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, టీటీడీ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.













