అఖిల్ మూవీ లేట్‌కు రీజనేంటంటే?
ఏజెంట్ సినిమా ఫలితం చేసిన గాయాన్ని అక్కినేని ఫ్యాన్స్ మర్చిపోయారేమో కానీ అఖిల్ మాత్రం దాని నుంచి బయటకు రావడానికి చాలానే టైమ్ తీసుకున్నడు. రిలీజైన మూడో రోజే రిజల్ట్ ఎఫెక్ట్ ను తట్టుకోలేక దుబాయ్ వెళ్లిపోయాడు అఖిల్. దానికి తోడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ సైతం ఏదో వివాదంలో ఉండటం కూడా ఒక సమస్యగా మారింది.
ఇదిలా ఉంటే ఏజెంట్ రిలీజై దాదాపు 7 నెలలవుతున్నా, అఖిల్ తన తర్వాతి సినిమాను ఇంకా మొదలుపెట్టలేదు. ఇదిగో అదిగో అంటున్నారు తప్పించి దానికి ముహూర్తం మాత్రం ఫిక్స్ అవలేదు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ నటించనున్న 6వ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
యువి క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినమా లేట్ అవడానికి కారణం స్క్రిప్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరించడమేనని తెలుస్తోంది. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా అఖిల్ కెరీర్లోనే బిగ్గెజ్ బడ్జెట్‌గా రూపొందనుంది. కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ పడకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న ఆశతో ఉన్నాడు అఖిల్.













