అఖిల్ గుడ్ న్యూస్ చెప్పనున్నాడా?
అక్కినేని అఖిల్(Akkineni Akhil) హిట్ కొట్టే వరకు ఫ్యాన్స్ ముందుకు రానని చాలా స్ట్రాంగ్ గా డిసైడయ్యాడని స్వయంగా నాగార్జున(Nagarjuna) వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అఖిల్ హిట్ కొట్టాలంటే ముందు సినిమా అనౌన్స్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లి షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలి. కానీ ఇప్పటివరకు అఖిల్ తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసింది లేదు.
గతేడాది ఏజెంట్(Agent) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖిల్ ఆ సినిమాతో ఘోర పరాజయాన్ని అందుకున్నాడు. ఏజెంట్ కోసం అఖిల్ పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయింది. యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్ లో అఖిల్ ఓ సినిమా చేయనున్నాడని, రూ.100 కోట్ల బడ్జెట్ తో అఖిల్ ఆ సినిమాను చేయనున్నాడని ఆ మూవీకి ధీర(Dheera) అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి.
కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి మళ్లీ ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజా సమాచారం ప్రకారం అఖిల్, యూవీ క్రియేషన్స్ సినిమాను నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో మొదలు పెట్టనున్నాడని, దానికి సంబంధించిన కథ కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాని కంటే ముందుగా అఖిల్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, కథ బాగా నచ్చడంతో నాగార్జున(Nagarjuna) సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యాడంటున్నారు. దసరాకు సినిమాను అనౌన్స్ చేసి వెంటనే షూటింగ్ కు వెళ్లనున్నట్లు చెప్తున్నారు. దీని తర్వాతే యూవీ బ్యానర్లోని సినిమాను అనౌన్స్ చేస్తారని టాక్. రెండు సినిమాలను ఒకేసారి సమాంతరంగా తెరకెక్కించే అవకాశాలున్నాయంటున్నారు. ఇది నిజమైతే మాత్రం నెక్ట్స్ ఇయర్ అఖిల్ నుంచి ఓ సినిమా రిలీజవడం ఖాయం.













