సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న అఖిల్
అక్కినేని అఖిల్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ తన ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదు. అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా తనకు మంచి క్రేజ్ తో పాటూ స్టార్డమ్ ను తెచ్చిపెడుతుందనుకుంటే ఆ సినిమా డిజాస్టర్ అవడంతో అఖిల్ తీవ్ర నిరాశ చెందాడు. అందుకే అఖిల్ ఎక్కడా కనిపించకుండా ఉంటున్నాడు.
అయితే హిట్ విషయంలో అఖిల్ ఎంతో పట్టుదలతో ఉన్నాడని రీసెంట్ గా ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో నాగార్జున మాటల్ని బట్టి అర్థమవుతుంది. హిట్ కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ముందుకొస్తానని, అప్పటివరకు తన ముఖం చూపించనని అఖిల్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్సయ్యాడని నాగ్ అక్కినేని ఫ్యాన్స్ కు తెలిపాడు.
దీంతో అఖిల్ ను ఇప్పట్లో బయట చూడటం కష్టమేనని అర్థమవుతుంది. సొంత తాతయ్య ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాల్లోనే పాల్గొనలేదంటే ముందుముందు మరే ఈవెంట్ లో కూడా కనిపించే ఛాన్స్ లేదు. వెనుక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు కూడా హిట్స్ అందుకుని దుసుకెళ్తుంటే అఖిల్ కు మాత్రం ఇంకా హిట్ రాలేదు. అందుకే ఇప్పుడు అఖిల్ ఇంతటి బలమైన డెసిషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.













