మరోసారి రిస్క్ చేస్తున్న అఖిల్?
అక్కినేని అఖిల్(Akkineni akhil) తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తొమ్మిదేళ్లవుతున్నా ఇప్పటివరకు సాలిడ్ హిట్ పడలేదు. అఖిల్(Akhil) సినిమాతో అరంగేట్రం చేసిన అఖిల్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most eligible bachelor) సినిమాతో హిట్ అందుకున్నాడు కానీ ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవలేదు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఎంతో కష్టపడి ఏజెంట్(Agent) మూవీ చేశాడు.
భారీ అంచనాల మధ్య రిలీజైన ఏజెంట్ డిజాస్టర్ గా మిగిలింది. ఏజెంట్ రిలీజై ఏడాది దాటినా అఖిల్ ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టింది లేదు. అయితే అఖిల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయని నెట్టింట తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి యువి క్రియేషన్స్(UV Creations) లో అనిల్(Anil) అనే కొత్త దర్శకుడితో ఓ పీరియాడికల్ మూవీకి అఖిల్ ఓకే చెప్పాడని టాక్.
అఖిల్ ఆ సినిమా కోసమే జుట్టు పెంచుతున్నాడని కూడా వార్తలొచ్చాయి. దీంతో పాటూ వినరో భాగ్యము విష్ణుకథ(Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్(Murali Kishore) దర్శకత్వంలో నాగార్జున(nagarjuna) నిర్మాతగా మరో సినిమాకు కూడా అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఆ రెండు సినిమాలు కూడా రూ. 100 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నాయని సమాచారం. వీఎఫ్ఎక్స్ భారీగా ఉండనుండటం వల్ల సినిమాకు బడ్జెట్ పెరుగుతుందంటున్నారు. అయితే ఈ వార్త విన్న నెటిజన్ల అఖిల్ భారీ బడ్జెట్ తో మరోసారి రిస్క్ చేస్తున్నాడంటున్నారు. అలా కాకుండా మంచి కథతో తక్కువ బడ్జెట్ సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉన్నా ఎక్కువ నష్టం జరక్కుండా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి అఖిల్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది.













