Lenin: అఖిల్ లెనిన్ పై షూటింగ్ అప్డేట్

అక్కినేని అఖిల్(Akkineni Akhil) కు ఏం చేసినా కలిసి రావడం లేదు. ఇప్పటికే పలు సినిమాలు చేసినప్పటికీ అందులో ఏదీ అఖిల్ ను స్టార్ హీరోను చేయలేకపోగా కనీసం సూపర్ హిట్ ను కూడా అందించలేకపోయింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని సురేందర్ రెడ్డి(Surender reddy) దర్శకత్వంలో ఎంతో కష్టపడి ఏజెంట్(Agent) అనే పాన్ ఇండియా సినిమా చేస్తే అది టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది.
ఏజెంట్ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరి(Murali Krishna Abburu) దర్శకత్వంలో లెనిన్(Lenin) అనే సినిమా చేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమా తో మంచి హిట్ అందుకోవాలని అఖిల్ తెగ ప్రయత్నిస్తూ అందులో భాగంగానే సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ అప్డేట్ తెలుస్తోంది.
జూన్ మొదటి వారంలో ఓ స్పెషల్ సెట్ లో లెనిన్ క్లైమాక్స్ ను షూట్ చేయనున్నారనట. దీని కోసం కొన్ని ప్రత్యేక స్టంట్స్ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అఖిల్ పై ఈ స్టంట్స్ ను షూట్ చేయనున్నారట. తర్వాత అఖిల్ పై ఓ సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారని, ఈ సాంగ్ కోసం కూడా స్పెషల్ సెట్స్ వేయనున్నారని తెలుస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ చిత్తూరు యాసలోనే మాట్లాడతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా శ్రీలీల(Sree Leela) నటిస్తోంది.