అఖిల్ కి రీ లాంచ్ మళ్ళీ అవసరమా???
యంగ్ హీరో అఖిల్ ఇంకా తన కేరాఫ్ అడ్రెస్ కింగ్ అక్కినేని నాగార్జున గానే ఉంది. అఖిల్ లాస్ట్ మూవీ ఏజెంట్ తనని బాగా డైలమాలో పడేసింది. దానికి కారణం ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే. అసలు ఏజెంట్ మూవీకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. ఆ సినిమా ఫ్లాపుతో అఖిల్ తన తరువాత సినిమాని ఇంకా మొదలుపెట్టలేదు.
అఖిల్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ సినిమాకి సంబంధించి ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు. ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ లేనందున్న అసలు ఈ మూవీ ఉందా లేదా అనే అనుమానాలు చాలానే ఉన్నాయి. ఆరా తీస్తే ఈ స్క్రిప్ట్ కి సంబంధించిన కొన్ని మార్పుల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేటట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ పేరు వెలుగులోకి వచ్చింది. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ అందుకున్న ‘కార్తీక్ దండు’ అఖిల్ కి ఒక స్టోరీ లైన్ చెప్పాడట.
అయితే ఇది కేవలం చర్చనా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కార్తీక్ మాత్రం ముందు ‘విరూపాక్ష 2 ‘ సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో హీరోని ఇంకా ఫైనల్ చేయలేదు. సాయి ధరమ్ తేజ్ చేయాలి అంటే కొంత టైమ్ పడుతుందనే చెప్పాలి. అందుకోసం హీరోగా అఖిల్ ని ఏమైనా ప్లాన్ చేశారేమో అనే ఆలోచనలు కూడా ఉన్నాయి.
పరిస్థితులు ఎలా ఉన్నా త్వరగా ఏదొక మూవీని ప్లాన్ చేసుకోవాలి అఖిల్. అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఏదొక సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. మరి అఖిల్ ఎందుకు ఇలా గ్యాప్ తీసుకొన్నాడు తనకి తాను ఆత్మ విమర్శ చేసుకోవాల్సిందే. హీరో అంటేనే జయాపజయాలు. అఖిల్ కొంతకాలం ఈ విమర్శలను పక్కన పెట్టి తన కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి. మరి నెక్స్ట్ సినిమాతో అయినా అఖిల్ విజయాల బాటలో పయనిస్తాడా లేదో చూడాలి.













