Akhil Akkineni: ఎట్టకేలకు అఖిల్ మొదలుపెట్టాడు
ఏజెంట్(Agent) సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్(akkineni Akhil) తాజాగా తన కొత్త సినిమాను మొదలుపెట్టాడు. దానికి సంబంధించిన లాంచింగ్ కూడా అయిపోయింది. వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వంలో ఈసారి అఖిల్ నటించనున్నాడు. ఈ సినిమాను మనం బ్యానర్(Manam Banner) లో నాగార్జున(Nagarjuna)తో పాటూ సితార ఎంటర్టైన్మెంట్స్(sithara Entertainments) కూడా నిర్మించబోతుంది.
ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా టాలీవుడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela) నటించడనుండగా తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రెండు ఊళ్ల మధ్య జరిగే కథగా ఇది రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ వెర్షన్ బాగా వచ్చిందంటున్నారు. అయితే అఖిల్ దీని కంటే ముందుగా యువి క్రియేషన్స్(UV Creations) లో ఓ సినిమాను చేయాల్సింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను పెండింగ్ లో పెట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టును నాగార్జున సైతం దగ్గరుండి అన్నీ చూసుకుంటారని సమాచారం. నిర్మాతగా నాగ వంశీ(Naga Vamsi) కూడా ఉంటాడు కాబట్టి టెన్షన్ పడాల్సిన పన్లేదు. వచ్చే ఏడాదిలో సినిమాను రిలీజ్ చేసేలా మేకర్స్ షూటింగ్ ను ప్లాన్ చేయనున్నారట. మరి అఖిల్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా తనకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













