ఎట్టకేలకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా?
ఏజెంట్(Agent) సినిమా డిజాస్టర్ అవడం వల్ల అక్కినేని అఖిల్(Akkineni Akhil) కెరీర్ ఒక్కసారిగా స్లో అయింది. తర్వాతి సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. కథలైతే వింటున్నాడు కానీ ఏ సినిమా గురించి అనౌన్స్ కాలేదు. ఆ మధ్య యూవీ క్రియేషన్స్(UV Creations) లో కొత్త డైరెక్టర్ తో సినిమా అన్నారు కానీ దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. పూరీ జగన్నాథ్(puri Jagannadh) కూడా అఖిల్(akhil) కోసం ట్రై చేస్తున్నాడన్నారు కానీ అఖిల్ ఇంట్రెస్టింగ్ గా లేడని టాక్.
ఇప్పుడు ఫైనల్ గా అఖిల్ ఓ చిన్న డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అతను మరెవరో కాదు. కిరణ్ అబ్బవరం(kiran Abbavaram)తో వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha) చేసిన మురళీ కిషోర్(murali Kishore) సినిమాకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామాగా ఇది తెరకెక్కనుందట. నాగార్జున(nagarjuna) స్వయంగా కథ విషయంలో డెసిషన్ తీసుకున్నట్లు టాక్.
ప్రాజెక్ట్ ఖర్చు విషయంలో అసలు రాజీ పడకూడదని స్వయంగా నాగ్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. హోమ్ ప్రొడక్షన్ అన్నపూర్ణ బ్యానర్లోనే(annapurna Banner) సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరి అఖిల్ కు మురళీ కిషోర్ ఎలాంటి సినిమాను ఇస్తాడో చూడాలి.













