Akhil Akkineni: అఖిల్ పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వారసుడు అఖిల్(Akhil) పెళ్లికి ముహూర్తం పెట్టేశారని తెలుస్తోంది. రీసెంట్ గానే అఖిల్ ముంబైకి చెందిన జైనబ్ రవ్జీ(Zainab Ravjee)తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి తమ పెళ్లికి లైన్ క్లియర్ చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తుం పెట్టినట్టు సమాచారం.
ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకుని లగ్న పత్రిక రాయించుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 24వ తేదీన అఖిల్- జైనబ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుందని ఇన్సైడ్ టాక్. అంతేకాదు అఖిల్ పెళ్లి హైదరాబాద్లోనే జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నారట.
నాగార్జున కొడుకు పెళ్లంటే టాలీవుడ్ మొత్తం కదిలొస్తుంది. టాలీవుడ్ నుంచే కాదు కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్, మల్లూవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు దిగుతారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కూడా ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశముంది.













