Akhanda2: ‘అఖండ 2’ 3Dలో చిన్నపిల్లల నుంచి అమ్మానాన్నల వరకు థియేటర్స్ లో గొప్పగా ఎంజాయ్ చేస్తారు: బోయపాటి శ్రీను
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ (Akhanda2: Thandavam). రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన రెస్పాన్స్ తో భారీ అంచనాలు సృష్టించాయి. ఈ చిత్రం డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని 3డీలోనూ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా బిగ్ రివిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన మీడియా మిత్రులకు, నందమూరి అభిమానులకు, త్రీడీ ఎక్స్పీరియన్స్ ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి, అందరికీ ధన్యవాదాలు. బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాని 3డీ ఫార్మాట్లోనూ తీసుకొస్తున్నాం. త్రీడీలో ఈ సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఈ చిత్రం.. భారతదేశ ఆత్మ, పరమాత్మ. ఈ సినిమా మన దేశ ధర్మం, ధైర్యం. ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది. కానీ, మన దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లల నుంచి అమ్మానాన్నల వరకు థియేటర్స్ లో అద్భుతంగా చూస్తారు. అది నా బాధ్యత. నేను మీకు ఇస్తున్న హామీ. ఈ సినిమాని దేశమంతా చూడాలనుకుంటున్నాం. అందుకే ప్రచారాన్ని ముంబయి నుంచి ప్రారంభించాం. భగవద్గీత, రామాయణం, భారతం. ఇవి మన దేశం ఆత్మ. ఈ మూడిటికి ఉన్న ఆత్మే అఖండ2. అందుకే ఈ సినిమా ఈ దేశ ఆత్మ పరమాత్మ అని చెప్పాను.
నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ కథ, కాన్వాస్, లొకేషన్ కి త్రీడీలో చేస్తే బాగుంటుందని అనుకున్నాం. అలాగే మాకు సమయం కూడా దొరికింది. 3D ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. విజువల్ గా మీకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మా ప్రామిస్.
రచ్చ రవి మాట్లాడుతూ… సినిమా చూసిన తర్వాత జై బాలయ్య.. హర హర మహాదేవ.. జై బోయపాటి అంటూ ఆడియన్స్ సినిమా థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. ఈ సినిమా మన అందరికీ బ్రతికినంత కాలం గుర్తుంటుంది.
డిఓపి సంతోష్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇది అద్భుతమైన సినిమా. బాలకృష్ణ గారితో బోయపాటి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
రేస్ త్రీడీ రాజు మాట్లాడుతూ.. మా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి నిర్మాతలకు మా హీరో బాలకృష్ణ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అఖండ2 త్రీడీలో హిస్టారికల్ గా ఉండబోతుంది. వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరికి థాంక్యు
ఎడిటర్ తమ్మి రాజు మాట్లాడుతూ.. అఖండ 2 అఖండ కన్నా పదింతలు ఎనర్జీతో ఉంటుంది. మీరందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ 3d లో కూడా చూడబోతున్నారు.
‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.






