Akhanda2: మారేడుమిల్లి అడవుల్లో అఖండ2
నందమూరి బాలకృష్ణ(nandamuri Balakrishna)- బోయపాటి శ్రీను(Boyapati Srinu). వీరిద్దరి కాంబినేషన్ కు ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే వీరి కలయికలో మూడు సినిమాలు రాగా అవన్నీ సూపర్హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నాలుగో సినిమా చేస్తున్నారు. అదే అఖండ2: తాండవం(AKhanda2: Thandavam). సూపర్ హిట్ సినిమా అఖండకు సీక్వెల్ గా వస్తున్న మూవీ అవడంతో అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అఖండ2 ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అడవులకు వెళ్లినట్టు తెలుస్తోంది. సినిమాలోని భారీ యాక్షన్ సీన్స్ మరింత సహజంగా రావడం కోసం బోయపాటి ఈ షెడ్యూల్ ను అక్కడ ప్లాన్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్ లో బాలయ్యకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట.
ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్లు గా నటిస్తున్న అఖండ2 లో ఆది పినిశెట్టి(Adhi Pinisetty) కీలక పాత్రలో నటిస్తుండగా, 14 రీల్స్ ప్లస్(14 Reels Plus) బ్యానర్ లో గోపీ ఆచంట(Gopi Achanta), రామ్ ఆచంట(Ram Achanta) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న అఖండ2కు మొదటి భాగానికి మ్యూజిక్ అందించిన తమన్(Thaman) మరోసారి పని చేస్తున్నారు.







