Akhanda2: బాలీవుడ్ లో అఖండ2 కోసం భారీ ప్లాన్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రస్తుతం అఖండ2(Akhanda2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ టీజర్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
అఖండ2తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అఖండ2 టీజర్ కు టాలీవుడ్ ఆడియన్సే కాకుండా బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే అఖండ2ను భారీ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అఖండ2 కోసం మేకర్స్ ఏకంగా రూ.1.6 కోట్లు ఖర్చు చేయగా, సినిమా ప్రమోషన్స్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో అఖండ2కు నెక్ట్స్ లెవెల్ లో ప్రమోషన్స్ చేయనున్నట్టు సమాచారం. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) విలన్ గా నటిస్తుండగా, సెప్టెంబర్ 25న అఖండ2 గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.