Ajith: రాజకీయ అరంగేట్రంపై అజిత్ క్లారిటీ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్(Ajith Kumar) రాజకీయాల్లోకి వచ్చే విషయంలో రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన అజిత్ రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. అందులో భాగంగా తాను రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని, పాలిటిక్స్ పట్ల తనకు ఇంట్రెస్ట్ లేదని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి మార్పు తీసుకురాగలమనే నమ్మకంతో అడుగులేస్తున్న వారంతా విజయం సాధించాలని ఆయన కోరారు. ఇటీవలే కొత్త పొలిటికల్ పార్టీని స్థాపించి, పాలిటిక్స్ లోకి వెళ్లిన విజయ్(Vijay) ఎంతో సాహసం చేశాడని అజిత్ అన్నారు.
రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డును అందుకోవడానికి రాష్ట్రపతి భవన్ కు వెళ్లినప్పుడు అక్కడి ఏర్పాట్లు చూసి తానెంతో ఆశ్చర్యపడ్డానని చెప్పిన అజిత్, దేశంలోని నాయకులు తమ జీవితాలను ఎలా గడుపుతారనేది తనకు అప్పుడే తెలిసిందని, ఒక ప్రాంతాన్ని, దేశాన్ని నడిపించడం ఎంతో కష్టమైన పని అని తనకు అప్పుడే అర్థమైందని,అందుకే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం చాలా సాహసవంతమైన పని అన్నానని తెలిపారు అజిత్.






