రీమేక్ ఖైదీని నేనే
ఖైదీ హిందీ రీమేక్‌కి ఖైదీ దొరికారు. నేనే ఖైదీ అని ప్రకటించారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్. కార్తీ నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ఖైదీ. ఈ సినిమా హిందీలో రీమేక్ కాబోతుంది. కార్తీ పోషించిన ఖైదీ పాత్రను అజయ్ దేవగన్ హిందీలో చేయనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలసి యస్.ఆర్.ప్రభు నిర్మించనున్నారు. అవును. ఖైదీ రీమేక్‌లో నేనే నటించబోతున్నాను. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని ట్వీట్ చేశారు అజయ్ దేవగన్. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.













