బంపరాఫర్ పట్టేసిన మంగళవారం డైరెక్టర్
ఆరెక్స్ 100(RX100)తో మంచి డెబ్యూ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) తర్వాత మహా సముద్రం(Maha Samudram)తో డిజాస్టర్ అందుకున్నప్పటికీ మంగళవారం(Mangalavaram) సినిమాతో తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ ను తీస్తానని అజయ్ భూపతి అప్పట్లోనే చెప్పాడు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ పూర్తి చేస్తున్నాడు.
ఇలాంటి టైమ్ లో అజయ్ భూపతికి ఓ బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా కోలీవుడ్(Kollywood) నుంచి. చియాన్ విక్రమ్(Chiyaan Vikram) కొడుకు ధృవ్(Dhruv) హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్నట్లు కోలీవుడ్ మీడియా వర్గాల అప్డేట్. కొన్ని నెలల కిందటే కథ చెప్పించిన అజయ్ భూపతి ఇప్పుడు ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడని సమాచారం.
మొన్న ధృవ్ బర్త్ డే సందర్భంగానే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ రావాల్సింది కానీ ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్న కారణంగా కొంచెం ఆలస్యమవుతుందని టాక్. రీసెంట్ టైమ్ లో టాలీవుడ్(Tollywood) డైరెక్టర్లకు కోలీవుడ్ లో మంచి ఛాన్సులొస్తున్నాయి. ప్రస్తుతం ధృవ్ కు అక్కడ మంచి మార్కెటే ఉంది. ఫాస్ట్ గా సినిమాలు చేయకపోయినా తండ్రి చూపించిన బాటలో డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నాడు. అందులో భాగంగానే అజయ్ భూపతితో ధృవ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండొచ్చు. ఈ సినిమా కల్ట్ లవ్ స్టోరీ కాకుండా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా వివరాలు వెలువడనున్నాయి.













