చిరూ సినిమాలో ఐశ్వర్యారాయ్
ఐశ్వర్యా రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎవరినైనా అందంగా ఉన్నావని పొగడాలంటే ఐశ్వర్యారాయ్ పేరుతో పోల్చేవారు. ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి. వయసు పెరుగుతున్నా ఆమె ఇంకా అంతే అందంతో ఉంది. మధ్యలో కూతురు పుట్టి కొంత కాలం సినిమాలకు దూరమైన ఐశ్వర్య మళ్లీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది.
రీసెంట్గా మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలోనూ ఐశ్వర్య కీ రోల్ చేసింది. ఆ సినిమా తర్వాత ఐశ్వర్యకు ఎక్కువగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్న రోల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు రీసెంట్గా టాలీవుడ్ లో ఓ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో.
చిరూ హీరోగా రానున్న మెగా157లో ముగ్గురు హీరోయిన్లుంటారని ఎప్పటినుంచో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరిగా ఐశ్వర్యను అనుకుంటున్నట్లు సమాచారం. మరి తెలుగులో నటించడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందో లేదో తెలియదు కానీ మెగా 157 మేకర్స్ మాత్రం ఐశ్వర్య కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.













