హాలీవుడ్ నుంచి అందాల తారకు పిలుపు
అందాల తార ఐశ్వర్యారాయ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. గతంలో అమె హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. అయితే హాలీవుడ్లో ఐష్‌కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌పైనే ఆమె ఫోకస్ పెట్టింది. ఇక పెళ్లయిన తర్వాత కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకొని ఐష్ రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కూడా ఐశ్వర్య క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో మూడు సినిమాలతో పాటు కోలీవుడ్‌లో ఓ భారీ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఆమెకు హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చిందని తెలిసింది. బాలీవుడ్లో టైం బాగాలేని ఈ సమయంలో హాలీవుడ్లో అయినా అదృష్టం కలిసివస్తుందేమోనని ఆమె ఓ ఇంగ్లీష్ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో ఐష్ నటించే హాలీవుడ్ మూవీ పట్టాలేక్కనుందట. ఈ సినిమాతో ఐస్ సక్సెస్ దక్కించుకుంటుందా అనేది చూడాలి.













