ఓటీటీ కోసం ఏజెంట్ రీ ఎడిటింగ్?
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏడేళ్లవుతున్నా అక్కినేని అఖిల్ కు ఇప్పటివరకు సాలిడ్ బ్లాక్ బస్టర్ పడింది లేదు. ఏజెంట్ తో పాన్ ఇండియా లెవల్ లో మంచి హిట్ కొడదామనుకున్న అఖిల్ కు ఆ సినిమా రిజల్ట్ నిరాశనే మిగిల్చింది. ఈ సినిమా కోసం అఖిల్ చూసిన ఎదురుచూపులు, తను పడిన కష్టం, తను పెట్టుకున్న ఆశలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి.
ఎన్ని అనుకున్నా సరే ఈ సినిమా డిజాస్టర్ అని అందరూ ఒప్పేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏజెంట్ ను మే 19న ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. ఎలాగూ థియేటర్ లలో చూడలేదు కదా ఓటీటీలో రాగానే చూద్దాం అనుకున్న వారంతా ఏజెంట్ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేశారు. కానీ ఆ రోజు అది రిలీజ్ కాలేదు. సరే తర్వాత వారమైనా రిలీజవుతుందనుకుంటే అప్పుడు కూడా రిలీజ్ కాలేదు.
ఏజెంట్ రీరిలీజ్ చెప్పిన టైమ్ కు జరగకపోవడానికి కారణం ఈ సినిమాను మళ్లీ ఎడిటింగ్ చేస్తుండటమేనట. ఏప్రిల్ లో రిలీజ్ దగ్గర పడేసరికి హడావుడి, ఒత్తిడి కారణంగా సినిమాకు ఎడిటింగ్ సరిగా జరగలేదని, అందుకే ఇప్పుడు ఈ సినిమాను రీఎడిట్ చేసి, కొన్ని అనవసరమైన సీన్లను తీసేసి, కొన్ని సీన్లు కలిపే పనిలో చిత్ర బృందముందని టాక్.
ఇప్పటివరకు ఈ విషయమై అఫీషియల్ గా బయటకు చెప్పలేదు కానీ ఇది నిజమే అని ఇన్ సైడ్ టాక్. ఎలాగూ ఫ్లాప్ సినిమా కాబట్టి సినిమాను ఉన్నది ఉన్నట్లు రిలీజ్ చేస్తే ఓ పనైపోతుంది అనుకోకుండా ఓటీటీ రిలీజ్ కోసం ఇంత ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కొత్తగా సినిమాను ఎడిట్ చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఏదైనా ఏజెంట్ ను త్వరగా ఓటీటీలో వదిలితేనే బెటర్.













