U/A సర్టిఫికేట్ తో ‘మేజర్’ మూవీ
అడివి శేషు ‘మేజర్’ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. 26/11 ముంబై దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడి.. వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ లైఫ్ స్టోరీనే ‘మేజర్’ సినిమా. నటుడిగా డిఫరెంట్ క్యారెక్టర్లు పోషిస్తూ.. వర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అడివి శేషు. అతను తాజాగా హీరో నటించిన చిత్రం ‘మేజర్’ 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీకి ప్రొడ్యూసర్‌గా వ్యవహారించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 3వ తేదీన ‘మేజర్’ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్.
ఈ నేపథ్యంలో ఈ మూవీ హిందీ వర్షన్‌కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రన్ టైమ్ 2 గంటల 28 నిమిషాలు ఫిక్స్.. U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మూవీని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులను ఇందులోని కంటెంట్, లోతైన భావోద్వేగాలు ఆకట్టుకున్నట్లు సమాచారం. మూవీ కంప్లీట్ అయ్యాక స్టాండింగ్ ఒవేషన్.. పోరాట యోధుడు సందీప్ ఉన్ని కృష్ణన్‌కు సెల్యూట్ చేసినట్లు తెలిసింది. కాగా.. ఈ మూవీని పది రోజుల ముందుగానే 9 నగరాల్లో స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ఒక్కో నగరంలో ఒక రోజు ప్రీ రిలీజ్ స్పెషల్ షోలు వేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఓపెన్ చేసిన ప్రీ బుకింగ్స్ మంచి స్పందన వస్తోందన్నారు. ఇలా సినిమా విడుదలకు ముందే స్పెషల్ షో ప్రదర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రను ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ షోలు వేస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. పుణే, జైపూర్, అహ్మాదాబాద్, ఢిల్లీ, లక్నో, బెంగుళూరు, కొచ్చి, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ‘మేజర్’ ప్రీ రిలీజ్ షోలు ప్రదర్శించనున్నారు. డిఫరెంట్ మూవీలతో టాలీవుడ్ ఆడియన్స్‌ను అలరిస్తున్న అడివి శేషు.. ఈ మూవీలో కూడా ఉన్నికృష్ణన్ క్యారెక్టర్లో ఒదిగిపోయినట్లు తెలుస్తోంది. శశి కిరణ్ తిక్క డైరెక్షన్లో రూపొందిన మేజర్ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ సినిమాకు కథ, స్ర్కీన్ ప్లే అడివి శేషు అందించాడు.
https://twitter.com/taran_













