Adivi Sesh: శేష్ తొందర పడాల్సిందే!
కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తాడని పేరున్న అడివి శేష్(Adivi Sesh) నుంచి హిట్2(Hit2) తర్వాత మరో మూవీ రాలేదు. ఆ సినిమా వచ్చి కూడా రెండేళ్లు దాటింది. ఏ సినిమా చేసినా అది సక్సెస్ అవాలనే రూల్ పెట్టుకుని ఆ ప్రకారం అడుగులేస్తున్న శేష్ సినిమా సినిమాకీ ఇంత గ్యాప్ తీసుకోవడం ఓ విధంగా తన మార్కెట్ ను తగ్గిస్తుందనే చెప్పాలి.
ముందు శృతి హాసన్(Shruthi Haasan) ను అనుకుని తర్వాత ఆ ప్లేస్ లోకి మృణాల్(Mrunal) రావడం వల్ల డెకాయిట్ షూటింగ్ లేటైతే, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుండటం వల్ల గూఢచారి2 షూటింగ్ లేటవుతుందని తెలుస్తోంది. అయితే అడివి శేష్ నటిస్తున్న ఈ రెండు సినిమాలూ 2025లోనే రిలీజవనున్నాయని ఆయన సన్నిహితులంటున్నారు. ఏదేమైనా ఇకనైనా శేష్ త్వరపడితే బెటర్.













