Aditi Shankar: అదితి శంకర్ ఫేవరెట్ హీరో ఎవరంటే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా భైరవం(bhairavam). నాంది(Naandhi) ఫేమ్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కానుండగా ఆ సినిమాతో అదితి శంకర్(Aditi Shankar) హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేయబోతుంది. అదితి అంటే మరెవరో కాదు డైరెక్టర్ శంకర్(Shankar) కూతురు.
భైరవం సినిమాతో తన గ్రాండ్ డెబ్యూను ఇవ్వనున్న అదితి రీసెంట్ గా తన ఫేవరెట్ యాక్టర్ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అతనెవరో కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). తాను థియేటర్లో చూసిన మొదటి తెలుగు సినిమా కూడా మగధీరనే అని చెప్పిన అదితి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దానికి కారణం అదితి తండ్రి శంకర్, రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చరణ్ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగలడం. ఓ వైపు తండ్రి శంకర్ చరణ్ కు డిజాస్టర్ ను మిగిలిస్తే, కూతురు అదితి మాత్రం నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇదే సందర్భంగా అదితి మాట్లాడుతూ తనకు యాక్టర్ గా నాని(Nani) అంటే కూడా ఎంతో అభిమానమని చెప్పింది.






