Aditi Rao Hydari: పెళ్లి తర్వాత ఆఫర్లు కరువయ్యాయంటున్న అదితి

సమ్మోహనం(sammohanam) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన అదితి రావు(aditi rao hydari) హైదరి గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అదితికి ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో ఖాళీ లేకుండా ఉన్న అదితికి ఇప్పుడు ఆఫర్లే లేవు.
రీసెంట్ గా అదితి ఓ ఇంటరాక్షన్ లో భాగంగా తన కెరీర్ గురించి మాట్లాడింది. తనకు పెళ్లయ్యాక పెద్దగా అవకాశాలు రావడం లేదని, పర్సనల్ లైఫ్ లో పెళ్లి లాంటి మైల్ స్టోన్స్ తర్వాత హీరోయిన్లు రెగ్యులర్ గా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని అదితి చెప్పింది. అందం, టాలెంట్, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అదితికి పెళ్లి తర్వాత ఆఫర్లు రాకపోవడమేంటని అందరూ షాకవుతున్నారు.
గత కొంతకాలంగా హీరో సిద్ధార్థ్(siddharth) తో రిలేషన్‌షిప్ లో ఉన్న అదితి, గతేడాది అతన్ని పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత తనకసలు ఆఫర్లు రావడం తగ్గిపోయాయని అదితి చెప్పగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో హీరామండి(heeramandi) సినిమా తర్వాత కూడా అదితి తనకు అవకాశాలు రావడం లేదని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.