Aditi: హీరోయిన్ గా మారుతున్న బాలయ్య పాట సింగర్

ఇండస్ట్రీ ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు. డైరెక్టర్ అవుదామని వచ్చినోళ్లు హీరోలుగా, హీరోలవుదామనుకున్నోళ్లు నిర్మాతలుగా మారుతూ ఉండటం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే మరొకరికి ఎదురైంది. టాలీవుడ్ లో గత కొన్నేళ్లుగా సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒకరు ఇప్పుడు హీరోయిన్ గా మారుతున్నారు.
ఆమె మరెవరో కాదు, అదితి భావరాజు(Aditi Bhavaraju). అమ్మడి గురించి చెప్పాలంటే బాలకృష్ణ(balakrishna) అఖండ(Akhanda) సినిమాలో జై బాలయ్య(jai Balayya) సాంగ్ పాడిన సింగర్ అని చెప్పాలి. అలా చెప్తే ఎవరైనా వెంటనే అదితిని గుర్తు పడతారు. ఇప్పటికే సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అదితి భావరాజు, ఇప్పుడు దండోరా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.
తెలంగాణ నేపథ్యంలో గ్రామీణ కథతో రూపొందుతున్న ఈ సినిమాకు మురళీ కాంత్(Murali Kanth) దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ తో పాటూ మంచి కథాంశం, సమాజంలోని సామాజిక అంశాలతో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. కలర్ ఫోటో(Colour Photo), బెదురులంక(Bedurulanka) సినిమాలను నిర్మించిన రవీంద్ర బెనర్జీ దండోరా(Dandora)ను నిర్మిస్తున్నారు.