అలా అయితే ఆమె కెరీర్ కష్టమే ???
యూట్యూబర్ గా, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రయాణం మొదలు పెట్టిన వైష్ణవి చైతన్య తొలుత చిన్న చిన్న పాత్రలు చేసినా బేబీ సినిమా తో లీడ్ రోల్ లో అందరినీ మెప్పించింది. వైష్ణవి బేబీ సినిమాలో తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఈ మూవీ లో స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉన్న రోల్ తనది. దానికి తగట్టుగానే అందం, అభినయం తో మెప్పించింది. ఈ మూవీ తో వైష్ణవి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అవుతుందని చెప్తున్నారు.
బేబీ మూవీ ఇప్పటికే 50 కోట్లు కలెక్ట్ చేసింది. దానితో మూవీ లోని హీరో అయిన ఆనంద్ దేవరకొండ కి మరియు హీరోయిన్ అయిన వైష్ణవి కి వరుసగా సినిమా ఛాన్సులు వస్తున్నాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపధ్యం లోనే వైష్ణవి కాస్త ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకొంటే తన కెరీర్ సుఖాంతం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. అలా కాకుండా తనకి ప్రాధాన్యత లేని పాత్రలను సెలెక్ట్ చేసుకొని, ఎక్కువ రెమ్యూనరేషన్స్ కోసం అలాంటి పాత్రలు చేస్తే వైష్ణవి కెరీర్ కి బ్రేక్ పడినట్లే.
బేబీ లాంటి పాత్రలు మళ్ళీ తనకి దొరకపోవచ్చు , లేకపోతే దానిని మించిన కథలైనా దొరకొచ్చు. కాబట్టి తనకి వచ్చే ప్రతి ఆఫర్ ని మాత్రం ఆలోచించి సైన్ చేస్తే తన కెరీర్ హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మాత్రం తాను మొదలు పెట్టిన దగ్గరికే వెళ్తుంది. ఈ నేపథ్యంలో వైష్ణవి ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందనే విషయంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













