‘మళ్ళీ మొదలైంది’లో సుహాసిని మణిరత్నం
సుమంత్, నైనా గంగూలీ జంటగా టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం మళ్లీ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇన్స్పిరేషనల్ రోల్లో సీనియర్ నటి సుహాసి మణిరత్నం నటిస్తున్నారు. ఎంటప్రెన్య్రూ, ధైర్యం, సాహసవంతమైన సింగిల్ మదర్ సుహా పాత్రలో ఈమె కనిపిస్తున్నారు. సుహాసిని పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.













