శ్రీలీలను చూసి షాకవుతున్న హీరోలు
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా శ్రీలీలనే కనిపిస్తుంది. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరితో సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న శ్రీలీల, కళ్ల ముందే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మహేష్ బాబు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరి సినిమాల్లో అమ్మడునే లీడ్ హీరోయిన్.
శ్రీలీల నటించిన సినిమాల్లోని ఏదైనా సాంగ్ లేదా ప్రోమో రిలీజ్ అవడం లేటు. అది వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. సాంగ్స్ లో ఆమె ఎట్రాక్షన్ ఓ రేంజ్ లో ఉండటమే దీనికి కారణం. డ్యాన్సులకు పెట్టింది పేరైన శ్రీలీల కు డ్యాన్స్ విషయంలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. మొదటి సినిమా పెళ్లి సందడితో మొదలుపెట్టి ధమాకాలో కూడా డ్యాన్స్ లో తన జోష్ ఏంటో చూపించింది.
ఇప్పుడు రామ్ హీరోగా వస్తున్న స్కంద సినిమాలో కూడా డ్యాన్స్ లు నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయని ప్రోమోలు చూస్తుంటే తెలుస్తోంది. రామ్ లాంటి మంచి డ్యాన్సర్ ను కూడా శ్రీలీల తన ఈజ్‌తో డామినేట్ చేసిందంటే ఆమె ఎంతటి డ్యాన్సరో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గా ఆదికేశవ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ లో అయితే శ్రీలీల నుంచి చూపు తిప్పుకోవడం కూడా కష్టంగా ఉంది. ఈ డామినేషన్ చూసి, సగటు హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారట.













