గ్లామర్ హీరోయిన్ రీ ఎంట్రీ
సీనియర్ హీరోయిన్లలో చాలా మందికి చిత్ర పరిశ్రమ నుండి పిలుపు వస్తోంది. ఇప్పటికే నటనకు దూరంగా ఉన్నవారిని సైతం వదలకుండా సంప్రదిస్తున్నారు. మళ్లీ నటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో అత్త, అమ్మ, వదిన వంటి పాత్రలకు మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోలకు లేదా హీరోయిన్లకు తల్లిగా నటించాలంటే వారికి హీరోయిన్ ఇమేజ్ ఉండితీరాలి. అందుకే సీనియర్ హీరోయిన్లకు దండిగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నదియా, ఖుష్బు, సరిత, సీత, మీనా వంటి వారు తల్లి పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఒకప్పటికి గ్లామర్ హీరోయిన్ నగ్మా కూడా చేరనుందని తెలిసింది. నగ్మా చాలాకాలంగా సినిమాకు దూరంగా ఉంది. తాజాగా నగ్మా చేత నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నగ్మా నటిస్తుందని సమాచారం. హీరోకు తల్లిగా నటించనుందని తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.













