కియారా ఎవరి పక్కన నటించనుంది?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందని తెలియగానే అందరూ షాక్ కు గురయ్యారు. వారిద్దరి కాంబోలో రానున్న వార్ 2 మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ సెలెక్ట్ అయిందని తెలియగానే ఆ వార్త నెట్టింట బాగా హల్చల్ చేస్తుంది. అయితే కియారా వీరిద్దరిలో ఎవరి పక్కన జోడీగా ఆడిపాడుతుందనే విషయం మాత్రం తెలియలేదు.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో తారక్ పాత్రకు కొన్ని నెగిటివ్ షేడ్ ఉండనున్నాయట. ఒకే మిషన్ మీద వ్యతిరేక దిశలో పనిచేసే వారిద్దరూ చివరిఇ దశం కోసం ఒక్కటై చేతులు కలిపి దేశ ద్రోహుల అంతు చూడటమే వార్2 మెయిన్ ప్లాట్ గా తెలుస్తోంది. త్వరలోనే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఫైనల్ స్క్రిప్ట్ ను రెడీ చేసి యష్ ఫిల్మ్స్ తో ఓకే చేయించుకుని తర్వాత హీరోలకు నెరేషన్ ఇవ్వనున్నాడట.
సినిమాలో స్క్రీన్ స్పేస్ ఎక్కువగా హృతిక్ రోషన్ కే ఉంటుంది కాబట్టి కియారా హృతిక్ పక్కనే నటించనుందని తెలుస్తోంది. కానీ ఈ సినిమా హీరోయిన్ ట్రాక్, డ్యూయెట్లు లాంటివి లేకుండా స్క్రిప్ట్ ను చాలా పకడ్బందీగా రాసుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం తారక్ దేవర సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అక్టోబర్ నాటికి ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసి నవంబర్ నుంచి తారక్ వార్2 షూటింగ్లో పాల్గొననున్నాడు.













