మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్న విజయ్
డ్యూయల్ రోల్స్ చేసి అదరగొట్టడంలో విజయ్ కు స్పెషల్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పటికే 5 సార్లు ద్విపాత్రాభినయం చేసిన విజయ్ ఇప్పుడు మరోసారి ద్విపాత్రాభానయం చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్. లియో తర్వాత విజయ్ నటించే సినిమాలో తను డ్యూయల్ రోల్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విజయ్ కెరీర్లోనే బెస్ట్ బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. థియేట్రికల్ గా కూడా లియో బిజినెస్ బాగా జరుగుతుందని చెప్తున్నారు. లోకేష్ కనగరాజ్ తర్వాత విజయ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్లో 68వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స బ్యానర్లో అర్చన కళాపతి, కళాపతి ఎస్ అఘోరమ్, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఏజీఎస్లో ఈ సినిమా 25వ చిత్రంగా తెరకెక్కుతుంది.













