‘ఏబీసీడీ’ ఫస్ట్ లుక్ విడుదల
అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏబీసీడీ. రుక్సార్ థిల్లాన్ కథానాయిక. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధురు శ్రీధర్‌రెడ్డి, యష్ రంగినేని నిర్మాతలు. డి.సురేష్‌బాబు సమర్పిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ మలయాళంలో విజయవంతమైన ఎ.బి.సి.డి కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. అమెరికాలో పుట్టి పెరిగిన ఓ యువకుడు, ఏ పరిస్థితుల్లో ఇండియాకొచ్చాడు? వచ్చాక ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. ఈ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ.2.50 కోట్లకి అమ్మడయ్యాయి. ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:జుధా సాంధీ.













